పరుసు పోయింది

నా పేరు మోహన్. నాకు 28 ఏళ్ళు. ప్రస్తుతం ఢిల్లీ లో ఉంటున్నాను. ఇది కధ కాదు. నేను కొన్ని ఏళ్ళ క్రితం హైదరాబాదు లో ఉంటున్నప్పుడు నా జీవితం లో జరిగిన నిజమైన సంఘటన.
అప్పట్లో నాది నిజానికి ఆఫీస్ లో కూర్చుని చేసే పని. బయటికి వెళ్ళే పనులు తక్కువ. కాని ఒక రోజు తప్పని సరిగా ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళాల్సి వచ్చింది. బస్ లో అబిడ్స్ వెళ్ళి పని చూసుకుని బేగం పేట్ లో ఉన్న నా అఫీస్ కు వెళుతున్నాను. టాంక్ బండ్ దగ్గర బస్ బ్రేక్ డౌన్ అయింది. అందరూ దిగి వేరే బస్ ఎక్కుతున్నారు. నాకు బస్ పాస్ ఉంది. కాబట్టి మరీ రద్దీగా ఉన్న బస్ వదిలి కాస్త ఖాళీ గా బస్ కోసం ఎదురు చూస్తున్నాను. ఉన్న బ
అప్పటికి టైం సాయంత్రం 7 అవుతోంది. నా దగ్గర వున్న ఆఫీస్ సామానులు ఆఫీస్ లో వదిలి నేను ఇంటికి వెళ్ళాలి. బస్ స్టాండ్ లో నేను నిలుచున్న వైపు కాక అవతల వైపు మరో ఇద్దరు పెద్ద వయసు మగ వాళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరూ కాక వాళ్ళకు కాస్త ఎడంగా ఒక 7/8 మంది ఆడా మగా పిల్లలున్నారు. బస్ కోసం తొంగి చూస్తున్న నాకు పక్కన అలికిడి వినిపించింది. తల తిప్పి చూస్తే ఆ పిల్లల్లో ఇద్దరు నాకు దగ్గరగా వచ్చివున్నారు. ఇద్దరూ ఆడ పిల్లలు. నువ్వు అడుగు అంటే నువ్వు అడుగు అని గుస గుసగా అనుకుంటూ సిగ్గు పడుతూ ఉన్నారు. నేను తల తిప్పి చూడటం గమనించి ఓ పిల్ల తన కన్న పెద్దగా ఉన్న రెండో పిల్లను ముందుకు నెట్టింది.

ఏమిటి అన్నట్టు ఆ అమ్మాయి వైపు చూస్తూ ప్రశ్నార్ధకంగా తల వూపాను. నా దగ్గరగా వచ్చి – “పిల్లలం అందరం సరదాగా టాంక్ బండ్ కి వచ్చాము – ఆడుకుంటూ ఉన్నప్పుడు నా పరుసు పోయింది. డబ్బులు అన్నీ అందులోనే ఉన్నాయి. ఇప్పుడు ఇంటికి వెళ్ళటానికి డబ్బులు లేవు” చాలా సిగ్గు పడుతూ చెప్పింది.

అయ్యో పాపం అనిపించింది. “ఎంత కావాలి?” అడిగాను
“ట్వంటీ టు రుపీస్ ” వెనక్కి తిరిగి ఆ పిల్లల్ని లెక్క వేస్తున్నట్టుగా చూస్తూ చెప్పింది. నాతో మాట్లాడుతున్న అమ్మాయి అందరి కన్నా పెద్దది అనుకుంటా. ఆ అమ్మాయి సిగ్గు పడుతూ అడిగిన పద్దతి, అంత మంది పిల్లలూ, అడుగుతున్న అమౌంట్ అని పించలేదు. చూసి నాకు అది అబద్ధం
జేబు లోంచి డబ్బులు తీశాను. అన్నీ ఏభయ్ రూపాయలు నోట్లు, వంద నోట్లూ ఉన్నాయి. “ఇది గో” అంటూ ఓ ఏభయ్ నోట్ ఆ అమ్మాయి కి ఇచ్చాను. ఏభయ్ వద్దు ఇరవై రెండు రూపాయలు చాలంటూ చెప్పి, నా దగ్గర చిల్లర లేని కారణంగా, ఫర్వా లేదని నేను చెప్పటం వల్లా చివరికి ఏభయ్ తీసుకుంది.
“మీ అడ్రెస్ ఇవ్వండి – తర్వాత్ మీ డబ్బులు మీకు పంపించేస్తాను” అంది. వద్దని ఎంత చెప్పినా వినకుండా బలవంతం చేస్తే, చివరికి లోంచి నా విసిటింగ్ కార్డ్ తీసి ఇచ్చాను. జేబు
“చాలా థాంగ్సండీ” అని కార్డ్ చూస్తూ మిగిలిన పిల్లల దగ్గరికి వెళ్ళి పోయింది. నా బస్ వస్తే నేను వెంటనే బయలుదేరాను.

ఆ రోజు సాయంత్రం జరిగిన విషయం నేను మర్చి పోయాను. కాని అది జరిగిన మూడో రోజు నాకు ఓ ఫోన్ వచ్చింది.
“హలో, మీరు మోహన్ గారేనా?”
“అవును – మీరెవరు?”
“మోహన్ గారూ, నేనండీ సంధ్యని” – చాలా పరిచయం ఉన్న వ్యక్తి మాట్లాడుతున్న ఆ లేడీ ఎవరో నాకు అర్ధం కాలేదు. లా
“సంధ్యా!?!”
“అవునండీ – నన్ను గుర్తు పట్టలేదా? నేనేనండీ – మొన్న బుధవారం టాంక్ బండ్ దగ్గర నా పరుసు పోతే మీదగ్గర డబ్బులు తీసుకున్నాను” గల గలా చెప్పేసింది. అప్పుడు నాకు గుర్తు వచ్చింది. ఆ గొంతు ని పోల్చుకో గలిగాను. కాని ఆశ్చర్యంగా, గమ్మత్తు గా ఆ అమ్మయి నించి ఫోన్ రావటం గా అని పించింది. చాలా
“ఓ నువ్వా? గుర్తు వచ్చింది. – నేనండీ సంధ్యని అంటే ఎవరో అర్థం కాలేదు – నీ పేరు సంధ్యా?” అడి గాను
“అవునండీ – సారీ ఆ రోజు మీకు నా పేరు కూడా చెప్పనేలేదు. ఏంటీ – బావున్నారా?” ఎన్నాళ్ళనించో తెలిసిన వ్యక్తి లా మాట్లాడుతున్న ఆమాటలు విని నాకు నవ్వువచ్చింది.
తను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నానని – ఇంటి దగ్గర పిల్లల్ని అందర్నీ తనే ఆ రోజు టాంక్ బండ్ కి తీసుకు వచ్చానని, పరుసు పోయి డబ్బులు లేక పోయేసరికి ఎలా వాళ్ళందర్నీ తీసుకుని ఇంటికి వెళ్ళాలో తెలియక

చాలా అందోళన పడ్డానని, నేను హెల్ప్ చేసితనని ఆదుకున్నానని మొత్తం కధ అంతా చెప్పింది.
“ఆటో లో వెళ్ళి ఇంటికి వెళ్ళాక డబ్బులు ఇచ్చి వుండవచ్చు కదా” అని అడిగితే
“అవును – కానీ చాలా డబ్బులు అయ్యుండేవి – ఇంట్లో వాళ్ళు నాకు పెళ్ళి చేసి వుండే వాళ్ళు” అంటూ నవ్వేసింది.
‘అయినా అలా చేస్తే మీతో పరిచయం అయ్యేది కాదు కదా” అంది.
మాటలు విన్న మరుక్షణమే నాకు ఈ పిల్ల చిన్న పిల్ల కాదు అని పించింది. నాక్కూడా చాలా exciting గా అని పించింది.
నేను కూడా కాస్త రెలాక్స్ అయి సరదాగా మాట్లాడటం మొదలుపెట్టాను.
ఓ పది నిముషాలు మాట్లాడిన తరువాత
“మీకు నేను డబ్బులు ఇవ్వాలి” అంది.

“ఫర్వాలేదులే – అయినా ఇవ్వక్కర్లేదని చెప్పాను గా” అన్నాను.
“లేదు లేదు ఇచ్చేస్తాను కాని ఎలా ఇవ్వాలో తెలియటం లేదు – మీరు ఎక్కడ ఉంటారు?” అడిగింది.
“అమీర్ పేట్” చె ప్పాను
“ఓ….. అమీర్ పేటా? అయితే ప్లీజ్ మీరు కుకట్ పల్లి రాకూడదా” అంది

“ఎందుకు ?” అడిగాను.
“ఏం నన్ను కలుసు కోవటానికి రాకూడదా?” వస్తారా?” అంది. అని తనే మళ్ళీ “ప్లీజ్
మొత్తం మీద సండే ఉదయం 10 గంటలకి నేను కుకట్ పల్లి లో ఓ గుళ్ళో తనని కలవటానికి ఒప్పందం కుదిరింది. ఆ గుడికి ఎలా రావాలో, గుళ్ళో తనని ఎక్కడ కలుసుకోవాలో అంతా వివరంగా చెప్పింది. ఊహించని ఈ పరిణామానికి నాకు చాలా ఆశ్చర్యంగా సంతోషంగా అనిపించింది. ఓ పావు గంట క్రితం వరకూ పెద్దగా చెప్పుకో దగ్గదేమీ లేని నా రొమాంటిక్ లైఫ్ ఆ ఫోన్ కాల్ తో మలుపు తిరిగింది.
ఇంకా ఉంది.

Categorized in: