Beta Testing
కథ లో పేర్లు మార్చి కథను చదవాలి అనుకుంటున్నారా??
కథ లో ఉన్న పేరు కింద Find: లో ఎంటర్ చేసి Replace: లో మీరు మార్చాలి అని అనుకుంటున్న పేరు ఎంటర్ చేయండి
story lo ammayi peru priya unte meru divya ga change chyachu leda story lo pinni ni amma , amma ni pinni ga chnage chesi story chadavachu
కొత్తగా వచ్చిన మాస్టర్ కుటుంబం 20
పొద్దున్నే లేచాక ఈరోజు సెకండ్ సాటర్డే అని తెలిసి ఫ్రెషప్ అయ్యి తినేసి అర్చనా వదిన ఇంటికి వెళ్ళాను..
టైం కి పంకజం అత్త, వదిన లు ఎవరితోనో మాట్లాడుతున్నారు…
నన్ను చూసిన అత్త, రా రా అల్లుడూ,ఒసేయ్ సుమిత్రా వీడే నే సంజయ్,నా ముద్దుల అల్లుడు అని చెప్పింది ఆమె కి.
ఆమె కి విష్ చేసి,ఎవరు అత్తా ఆమె అన్నా..
అల్లుడూ ఇది మీ చిన్నత్త రా అంది..
మీ చెల్లెలా అత్తా అన్నా…
అవును సంజయ్,మీ అత్త చిన్న చెల్లెలు ని టౌన్ లో ఉంటాము అంది తియ్యటి గొంతుతో..
అవునా సుమిత్ర గారు,సరే అందరూ బాగున్నారా అన్నా ఫార్మాలిటీ కోసం.
ఏంటి అక్కా మీ అల్లుడు భలే కలిసిపోతాడు అని చెప్పావ్ నన్ను గారు గీరు అని అంటున్నాడే అని నవ్వుతూ, అందరూ బాగున్నారు అల్లుడూ అంది..
కొత్త కదే,కాస్తా మొహమాటం అంతే..ఒక్కసారి కలిసిపోతే ఇక మా అల్లుడు అంటే పడి చస్తావ్ లే పిల్లని ఇస్తా అంటూ..
హ హ్హా అలా అయితే పిచ్చ హ్యాపీ అక్కా, నాకూ అల్లుడు దొరికినట్లు అవుతుంది అంది అందంగా నవ్వుతూ..
నేనూ చమత్కారం పడుతూ,నీకు పెళ్లీడుకొచ్చిన కూతురు ఉందా అత్తా ఇంకా నీకే పెళ్లి కాలేదు అనుకున్నా అన్నా నవ్వుతూ..
నిజమే నే అక్కో, నీ అల్లుడు ఏకంగా నాకే స్పాట్ పెట్టాడు చూసావా,ఇంప్రెస్ అయ్యా అల్లుడూ కూతురిని ఇచ్చేస్తాలే అంది తానూ నవ్వేస్తూ..
సుమిత్రత్తా, నాకు మీ పిల్ల నచ్చితేనే చేసుకుంటా మరి,లేకుంటే లేదు అన్నా నవ్వేస్తూ..
హ హ్హా ఎలా ఉండాలేంటి అల్లుడూ నీకు పిల్ల??మా అక్క లాగా ఉంటే సరిపోతుందా లేక మీ వదిన లాగా ఉండాలా??
వాళ్ళిద్దరినీ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉండాలి సుమిత్రత్తా..
వాళ్ళిద్దరితో పాటూ నన్ను మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అల్లుడూ నా కూతురు..
అలాగైతే ఓకే అత్తో,నువ్వే ఇంత బాగా ఉన్నావ్ ఇక నీ కూతురు బాగుంటుంది లే అన్నా నవ్వుతూ..
తానూ నవ్వేస్తూ,అక్కో నీ అల్లుడు ఏమో అనుకున్నానే పిల్ల కన్నా ముందు తల్లికే బిస్కట్లు వేసేస్తున్నాడు అంది..
అంతే మరి ,ఏమనుకున్నావ్ నా అల్లుడు అంటే నాకే గనకా కూతురు వున్నింటే నేనే ఇచ్చేదాన్నే వాడికి,నాకు ఆ అదృష్టం లేదు మా అల్లుడు ని బాగా చూసుకుంటాను అంటే మాత్రం నీ పిల్లకిచ్చి పెళ్లి చేస్తా అంది పంకజం అత్త తన అభిమానం ని చూపిస్తూ.
చాల్లే అక్కో,ఏమో మొదట చూడాలి నీ అల్లుడు ని,అసలే ఈ కాలం పిల్లోళ్ళని నమ్మేదానికే లేదు అంది సుమిత్రా.
ఒసేయ్ పిన్నీ,నా మరిది బంగారమే మెంటల్ దానా, వాడు నీ కూతురు కి మొగుడు కావాలంటే మీరు వెయ్యి జన్మల పుణ్యం చేసుకోవాలి..
అబ్బో మీ వదిన కూడా సపోర్ట్ రా అల్లుడూ నీకు,ఇంతకీ ఏమి చేసావ్ రా నాయనా ఇంత కంట్రోల్ లో పెట్టావ్ వీళ్ళని..
హ హ్హా మంత్రం వేసాను అత్తా,నీకూ వేసేస్తా నువ్వు వెళ్ళేలోపు .నువ్వు కూడా వీళ్ళ లాగా అవుతావు..ఏమంటారు అత్తా,వదిన లు??
ఒరేయ్ అల్లుడూ,మాకు మంత్రం వేసావు ,మేము ఇక్కడే ఉంటాము కాబట్టి సరిపోయింది..అదే దానికి వేసావంటే పిచ్చి పడుతుంది ఇక్కడి నుండి వెళ్ళిపోయాక,కాస్తా ఆలోచించు అంది నవ్వుతూ..
హ హ్హా పోనీలే పంకజం పిన్నీ, సుమిత్రా పిన్నీ కూడా ఇక్కడికే వచ్చేస్తుంది ఫ్యామిలీ తో సహా మన సంజయ్ గాడి మంత్రానికి మురిసిపోయి అంది వదిన నవ్వేస్తూ..
ఓయబ్బో,మీరు అంతగా మురిసిపోకండే బాబూ,వీడి మంత్రాలు,చింతకాయలు నా దగ్గర పనిచేయవు లే అంది..
మేమూ అలాగే అనుకున్నామే చెల్లీ, ఒక్కసారి వీడికి అలవాటు అయ్యావంటే ఇక వాడి చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందే..
వామ్మో మీరు చెప్తుంటే భయంగా వుందే బాబూ,మీ అల్లుడు కి దూరంగా వుంటాలే అంది సుమిత్రా..
హా అద్దీ అలా ఉంటే నీకే మంచిది సుమిత్రా పిన్నీ అంది వదిన..
సరే సరేలే గానీ మీ మాటలు,ఇంతకీ ఏంటి ఈరోజు ప్లాన్ ??బోర్ గా ఉంది ఏమైనా ప్లాన్ చేయండి అంది సుమిత్రా..
హ్మ్మ్ మన ఊరి బయట “తెల్లగుట్ట” కి వెల్దామా??నేను చూసి చాలా రోజులైంది అల్లుడూ అంటూ పంకజం అత్త అనేసరికి వెళ్దాం అత్తా,సూపర్ గా ఉంటుంది అని నా అంగీకారాన్ని తెలిపాను..
ఒక అర్ధ గంట కి ప్రయాణం మొదలెట్టాము కాలినడకన,ఒక 20 నిమిషాలు నడిస్తే చాలు వచ్చేస్తుంది కాబట్టి మాట్లాడుకుంటూ బయల్దేరాము..
ఒక పది నిమిషాల తర్వాత పక్కూరి రాజా రెడ్డి కనిపించి పంకజం అత్త, వదిన లతో మాట్లాడుతూ ఉండగా నేనూ,సుమిత్రా మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాము..
ఏరా అల్లుడూ,ఇంతకీ ఏ మంత్రం వేసావేంటి వాళ్ళిద్దరికీ??అస్తమానమూ నిన్నే కలవరిస్తున్నారు అంది..
ఆమె మాటకు కాస్తా తడబడి,అదేమీలేదు లే సుమిత్రత్తా ఏదో వాళ్ళ ఇంటి పనులు అన్నీ చూసుకుంటూ చేదోడువాదోడు గా ఉంటా అందుకే వాళ్ళకి నా పైన అభిమానం అన్నాను కవర్ చేస్తూ..
Comments