Beta Testing
కథ లో పేర్లు మార్చి కథను చదవాలి అనుకుంటున్నారా??
కథ లో ఉన్న పేరు కింద Find: లో ఎంటర్ చేసి Replace: లో మీరు మార్చాలి అని అనుకుంటున్న పేరు ఎంటర్ చేయండి
story lo ammayi peru priya unte meru divya ga change chyachu leda story lo pinni ni amma , amma ni pinni ga chnage chesi story chadavachu
కొత్తగా వచ్చిన మాస్టర్ కుటుంబం 27
అది దైవ రహస్యం,మేమెవరమూ నీకు చెప్పే అవకాశం లేదు…నీకు నువ్వే తెలుసుకోవాలి ఇది ఆదేశం అని గుర్తుంచుకో…
సరే అత్తా అని తలూపి కాసేపు మాట్లాడి ఇంటికి వెళ్ళాను..
మధ్యాహ్నం తినేసి బెడ్ ఎక్కాను పుస్తకాన్ని తీసుకొని..
అహల్య ప్రేమమయపు చూపు రాజసింహుడు పైన పడింది,అదే సమయంలో రాజసింహుడు కూడా ఆరాధనతో అహల్య వైపు చూసాడు..
అలా రెండు రోజులు కర్ణుడు,నక్షత్రుడు ఆ యోధ వంశం దగ్గర గడిపి,భేతాళుడు దగ్గర ఇంకొన్ని కొత్త విద్యలు నేర్చుకొని తమ రాజ్యాలకి వెళ్లిపోయారు సూర్యకీర్తి, రాజసింహుడు లని రమ్మని చెప్పి..
ఇక భేతాళుడు యొక్క కఠోర శిక్షణ మొదలయ్యింది..అహల్యా కూడా రాజసింహుడు యొక్క పురోగతిని గమనిస్తూ ఉండేది.
ఒక నెల రోజులకి సకల విద్యలు రాజసింహుడికి అబ్బేసాయి..భేతాళుడు యమా ఖుషీ అయిపోయి,రాజసింహా నువ్వు నేర్చుకున్న ఈ విద్యలని ఎప్పుడూ దుర్వినియోగం చేయనని నాకు మాటివ్వు అంటూ ఒట్టు వేయించుకున్నాడు…మధ్య మధ్యలో సుధాముడు,సూర్యకీర్తి కూడా సలహాలు ఇవ్వడంతో రాజసింహుడు ఒక అతి బలవంతమైన యోధుడు గా రూపుదిద్దుకున్నాడు..
కండలు తిరిగిన దేహం,చూడగానే ముచ్చటేసే ముఖారవిందం, నూనూగు యవ్వన ప్రాయంలో6అడుగులు ఎత్తు పైనే ఉండి ఒక విగ్రహం లా చురకత్తుల చూపుతో వెలిగిపోతున్నాడు.
(నిజానికి నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అప్పుడూ అలాగే ఉన్నాను)..
రాజసింహా,నా గురుదక్షిణ ఏమిస్తావ్ మరి?భేతాళుడు అడిగాడు..
చెప్పండి గురువర్యా,మీరేమి అడిగినా నేను కాదనేది లేదు..
వీరుడిలా మాట ఇచ్చావు,మరి మాట తప్పవు గా రాజసింహా?
మాట తప్పితే నా తల తీసేయండి గురువర్యా..
భేతాళుడు ఆనందభాష్పాలు తో,రాజసింహా నా గారాలపట్టి అహల్యా ని వివాహం ఆడుతావని ఆశిస్తున్నాను.ఇదే ఈ గురువు నీ నుండి కోరే ఒక చిన్న సహాయం…
రాజసింహుడు భేతాళుడు పాదాలకి నమస్కరించి, ఈ నీ శిష్యుడు మాట ఇస్తున్నాడు గురువర్యా అహల్యాని అగ్ని సాక్షిగా వివాహం ఆడతాను ఇదే నా మాట..
భేతాళుడు ఖుషీ చెంది,ఇంకొక ముఖ్య విషయం రాజసింహా,మనకు జీవనోపాధి ఇస్తున్న ఈ రేనాటి చోళ సామ్రాజ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుతానని మాటివ్వు..
తప్పకుండా గురువర్యా, నా జీవితం మీరు ఇచ్చిన వరం, మీరేమి ఆదేశించినా నేను కాదనను..
(నాకు ఆశ్చర్యం అధికం అయ్యింది..అదేంటీ ఇప్పుడు నేను సువర్ణ ని ఇంత అమితంగా ప్రేమిస్తుంటే ఈ సివంగి తో నా పెళ్లి నిశ్చయం అయ్యిందేంటి అని ఆలోచనలో పడ్డాను..కాసేపటి ఆలోచన తర్వాత మళ్ళీ పుస్తకంలో లీనం అయ్యాను).
రాజసింహుడి మాట విన్న అహల్య సిగ్గుల మొలక అయింది..రాజసింహుడి మొహంలో సంతోషం వెల్లివిరిసింది..
సుధాముడు,సూర్యకీర్తి రాజసింహుడిని అభినందించారు సంతోషంగా….
అలా వాళ్ళందరి జీవితంలో సంతోషాలు వెల్లివిరుస్తుండగా,భేతాళుడు కి రాజ్యవర్ధనుడు నుండి కబురు వచ్చింది పక్క రాజ్యం “దివిటీ” ల నుండి ఆపద ఉందని..
భేతాళుడు రాజసింహుడిని ,సూర్యకీర్తిని పిలిపించి యోధులారా,మీ విద్యలని ప్రయోగించే అవకాశం మన శత్రురాజ్యం “దివిటీ” ల రూపంలో వచ్చింది.ఈ అవకాశాన్ని చేజార్చుకోకుండా మీ సత్తా చూపించండి అంటూ ఇద్దరినీ పంపించాడు..
వీళ్ళిద్దరూ రాజ్యానికి చేరుకున్నాక కర్ణుడు ఆత్మీయ స్వాగతం పలికాడు.. మహారాజు రాజ్యవర్ధనుడు కి ఇద్దరినీ పరిచయం చేయగా మహారాజు ముగ్గురికీ కర్తవ్య నిర్దేశనం చేసాడు…
మొత్తానికి యుద్ధం రోజు మొదలయ్యింది…దివిటీ మహారాజు చంద్రశేఖరుడు కి మొత్తం 9 మంది ఇతరా సామంత రాజులు మద్దతు పలికి పెద్ద ఎత్తున దండెత్తి వచ్చారు….
ముగ్గురు యోధులూ మెరుపులా కదిలి శత్రు రాజ్యపు సైన్యాన్ని మట్టికరిపించారు.ఆఖరికి చంద్రశేఖరుడు ప్రాణ భిక్ష ప్రసాదించమని అడగగా కర్ణుడు వదిలేసాడు…
Comments