page: 2
విక్రమ్ : ఇదే పని ఇక్కడ గ్రీన్ హోటల్స్ వెనుక చేస్తున్నారు.. కానీ ఇంత పెద్ద సంస్థల లాంటి వాటిల్లో ఇలాంటి పనులు జరుగుతుంటే వాళ్ళకి తెలియదా లేక వాళ్లే చేపిస్తున్నారో అర్ధం కావట్లేదు.
ఆదిత్య : నీకు ఇదంతా ఎలా తెలుసు?
విక్రమ్ : చేపించింది వీళ్ళ నాన్నే
ఆదిత్య : విక్రమ్ ని మానసని చూస్తూ..”ఇంట్రెస్టింగ్” అని నవ్వాడు.. దీని వల్ల మీకు ఎన్ని ఇబ్బందులో తెలుసా, ఇంతకీ మీ లవ్ మ్యాటర్ మీ ఇళ్లలో తెలుసా?
మానస : మా అమ్మకి తెలుసు, మా నాన్నకి తెలిస్తే అస్సలు యుద్ధం మొదలవుద్ది.
ఆదిత్య : ఆ తొక్కలే.. ఏమైనా అవసరం పడితే కాల్ చెయ్యండి హెల్ప్ చేస్తాను, నా లవ్ ఎలాగో సక్సెస్ అవ్వలేదు మిమ్మల్నయినా కలుపుతా.
మానస : ఎవరు అమ్మాయి.. ఎం చేస్తుంటుంది?
ఆదిత్య ఫోన్ తీసి చూపించాడు” అనురాధ నా మరదలు, సర్జన్ ” అన్నాడు, వరసగా మూడు బీర్లు తాగి నాలుగోది లేపుతూ.
విక్రమ్ : వచ్చినప్పటి నుంచి అదే పనిలో ఉన్నావ్, పోతావ్ త్వరగా
ఆదిత్య : నాకు మత్తు ఎక్కదు బాస్, అయినా ఇదే నా లాస్ట్ రేపటి నుంచి ఇక మందు ముట్టను అని నాలుగో బీర్ కింద పెట్టి ఐదో బీరు నోటికెత్తుకున్నాడు.
మానస విక్రమ్ చెవి దెగ్గరికి వెళ్లి : విక్రమ్ ఇందాక కూడా ఇదే చెప్పాడు, పచ్చి తాగుబోతులా ఉన్నాడు ఇతన్ని నమ్మి అమ్మాయిలని పంపించడం సేఫ్ అంటావా?
ఆదిత్య అది విని పక్కకి చూసి నీ పేరేంటి అని అడిగాడు, “భరత్” హ్మ్… నీ పక్కనే ఉన్న నాలుగు రాళ్లు అందుకుని నా మీదకి ఒకేసారి గట్టిగా విసిరేయి అన్నాడు.. భరత్ విక్రమ్ ని చూడబోతే విక్రమ్ లేచి చేతికి అందిన ఏడు గులక రాళ్లు ఆదిత్య వైపు విసిరాడు.. ఆదిత్య నవ్వుతూ పట్టించుకోకుండా బీర్ తాగి కింద పెట్టి కరెక్టుగా మొహం మీదకి వచ్చిన మిల్లి సెకండ్ లో అన్ని రాళ్లు పట్టుకున్నాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తే…
ఆదిత్య : చెప్పను కదా నాకు మత్తు ఎక్కదు అని, ఇప్పటికైనా నమ్ముతారా ఇక వదిలితే నేను బైలుదేరతాను.. అని లేచాడు.. ఆదిత్యని పంపించి విక్రమ్ మానస మిగతా వాళ్ల దెగ్గరికి వెళ్లి భయపడుతున్న అమ్మాయిలకి ధైర్యం చెప్పి సలీమా, రమ్య , పూజల సాయంతో మిగిలిన వాళ్ళని ఇంటికి పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
తెల్లారి లంబసింగి కొండా ట్రేక్కింగ్ కాన్సల్ చేసుకుని టూర్ ప్రయాణం మొదలుపెట్టారు, బస్సు బైలదేరింది.. విక్రమ్ మానస బస్సు వెనకాలే ఆదిత్య బండి మీద ఇద్దరు టూర్ ఎంజాయ్ చెయ్యడానికి నిర్ణయించుకున్నారు.. బస్సు తరువాత ఆగబోయేది అరకులో..
ముందు కాలేజీ బస్సు వెళ్తుంటే వెనకాలే బండి మీద నేను మానస వస్తున్నాం, మా మేటర్ ఎలాగో అందరికి తెలిసిపోయింది ఇక భయం ఎందుకులే అనుకున్నాం కానీ రూప మేడంని చాల బతిమిలాడాల్సి వచ్చింది, తనని ఇలా బండి మీద వస్తాము అని ఒప్పించడానికి.
Comments