page: 12
మానస : నా పేరు మానస, నీ బైక్ తీసుకెళ్లిన వాడు నా బాయ్ ఫ్రెండ్ కానీ మీరిద్దరు చూడటానికి ఒకేలా ఉన్నారు, ఇది ఎలా సాధ్యం?
ఆదిత్య : తాగింది నువ్వా నేనా?
మానస : నిజం అండి కావాలంటే చుడండి అని ఫోన్ తీసాను.
ఇంతలోనే రెండు సుమోల్లో ఒక పది మంది దిగి అందరిని కొట్టడం మొదలు పెట్టారు అబ్బాయిలందరిని కట్టేసి అమ్మాయిలని సుమోల్లోకి ఎక్కిస్తున్నారు…. చందు భరత్ ఇద్దరు తిరగబడ్డారు.. కానీ ఎక్కువ సేపు నిలవలేకపోయారు.. వాళ్ళని కొట్టి కట్టేసారు.
ఆదిత్యని చూసాను కోపంగా ఉన్నాడు
మానస : ప్లీజ్ ఏమైనా చెయ్యండి వాళ్ళని కాపాడండి.
ఆదిత్య : నీ బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చెయ్యి ముందు నా బండి తెమ్మను నేను అర్జెంటుగా వెళ్ళాలి టైం లేదు.
మానస : ఇతనితొ లాభం లేదని విక్రమ్ కి కాల్ చేసాను ఫోన్ ఎత్తలేదు.. ఇంతలో అమ్మాయిల అరుపులు వినిపించి ఆదిత్య అటు వైపు చూసి అటు నడుచుకుంటూ వెళ్ళాడు.
ఒకడు కొట్టడానికి రాడ్ పట్టుకుని వచ్చాడు, వాడిని గుండె మీద తన్నాడు అంతే అలానే దోళ్లుకుంటూ వెళ్లి సుమోని గుద్దుకున్నాడు… అంతే ఒక్కసారిగా ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగిపోయారు…
అందరూ ఆదిత్య చుట్టు కర్రలు రాడ్లతొ రౌండ్ అప్ చేసారు… నేనింకా అలానే నోరు తెరిచి జరగబోయేది చూడడానికి రెడీగా ఉన్నాను……
Comments