page: 2
ఇంకో వైపు మానస వాళ్ల నాన్న ఫోన్లో…
శివరాం : రాబర్ట్ గారు ఎలా ఉన్నారు?
రాబర్ట్ : పలకరింపులు తరువాత నాకు యాభై మంది అమ్మాయిలు కావాలని ఆర్డర్ ఇచ్చాను ఏమైంది?
శివరాం : ఈ పదిహేనో తారీకు మీ చేతుల్లో ఉంటారు, బెంగుళూరు నుంచి మల్లేష్ ఇరవై మందిని ఇక్కడ నుంచి నేను ముప్పై మందిని పంపిస్తున్నాను కానీ చిన్న మెలిక ఉంది.
రాబర్ట్ : ఏంటది…?
శివరాం : నా దెగ్గర ఇరవై మంది రెడీగా ఉన్నారు… ఇక్కడ కాలేజీ తరపునుంచి పిల్లలు వైజాగ్ వస్తున్నారు వాళ్ళని ఏదైనా చేసి లంబసింగి వైపు వచ్చేలా చేస్తాను మీరు మిగతా కావాల్సిన పదిమందిని తీసుకుపోండి..
రాబర్ట్ : అలాగే.. ఈ పని అయినా కరెక్ట్ గా చెయ్యండి.
…………………………………………………………..
నేను మానస వాళ్ల అమ్మతొ మాట్లాడి అందరి దెగ్గరికి వచ్చేసరికి.. మానస, సలీమా ఇంకా అమ్మ మాట్లాడుకుంటున్నారు.. ఎందుకులే వాళ్ళని కదిలివ్వటం అని పూజ వాళ్ల దెగ్గరికి వెళ్లాను
అందరూ ఎల్లుండి గురించి మాట్లాడుకుంటున్నారు..
విక్రమ్ : ఏంటి రమ్య అందరూ ఎల్లుండి ఎల్లుండి అంటున్నారు ఏముంది ఎల్లుండి?
పూజ : ఇందాక కేక్ కట్ చేసేటప్పుడు నువ్వు లేవు కదా, మానస వాళ్ల నాన్న మన క్లాస్ వాళ్లందరిని వైజాగ్ టూర్ తీసుకెళ్తున్నారు అందుకే అందరూ ప్లానింగ్ లో ఉన్నారు..
పూజ ఇంకేదో మాట్లాడుతుంది కాని నాకు ఏం వినిపించడం లేదు.. ఎల్లుండి అంటే 15వ తారీకు ఆరోజే అమ్మాయిలని లంబసింగి తీసుకెళ్తున్నారు వీళ్ళకి చాలా ముఖ్యమైన పని కానీ అదే రోజు ఈ ట్రిప్ ప్లాన్ చేశారు ఏదో జరుగుతుంది అర్ధం కావట్లేదు.. అందరూ తినడానికి వెళ్తున్నారు..
విక్రమ్ : భరత్ ఇలా రా.. (అందరూ వెనక్కి తిరిగారు) మీరు వెళ్ళండి మేము ఇప్పుడే వచ్చేస్తాం..
భరత్ : ఏంట్రా? అవతల ఆకలేస్తుంటే..
విక్రమ్ : తరవాత తినొచ్చు రా బె..
ఇద్దరం కార్లో ఇంటికి వెళ్ళాం.. అక్కడనుంచి భరత్ కి కార్ ఇచ్చి తను కారులో నేను బైక్ మీద తిరిగి పార్టీకి వచ్చేసాం..
భరత్ : ఎందుకు రా ఇదంతా?
విక్రమ్ : నీకు లవర్ ఉంది గా ఆ మాత్రం తెలీదా..
భరత్ : ఓహో… ఓకే.. ఓకే… ఎంజాయ్..
విక్రమ్ : ఏడిసావ్ లే పదా..
భోజనానికి వెళ్లి తినేసి నానీ కోసం చూసాను కుర్చీలో కూర్చొని టాబ్ లో ఆడుకుంటున్నాడు..వెళ్లి పక్కన కూర్చున్నాను.
విక్రమ్ : హాయ్ నానీ..
Comments