page: 3
నానీ : హాయ్ అన్నా..
విక్రమ్ : ఇందాక మానస కోసం అని నన్ను తీసుకెళ్ళావ్ కదా ఒకసారి మానసని అక్కడికి రమ్మని చెప్తావా?… నువ్వెళ్ళి రా ఈలోపు ఇందులో కొత్త గేమ్స్ ఇన్స్టాల్ చేసి ఇస్తాను…
నానీ వచ్చాక రెండు కొత్త గేమ్స్ వేసి తనకి ఇచ్చి ఇందాకటి ప్లేస్ దెగ్గరికి వెళ్లాను ఒక లైట్ ఉంటే ఆపేసాను … మానస వచ్చింది వెంటనే ఎవ్వరు చూడకముందే తన చెయ్యి పట్టుకుని కర్టెన్ లోపలికి లాగాను… మానస ఆశ్చర్యంగా నన్నే చూస్తుంది..
మానస నడుం పట్టుకుని అటు ఇటు చూస్తున్నాను ఎవరైనా వస్తున్నారేమో అని తల అటు ఇటు తిప్పుతుంటే నా ముక్కు మానస ముక్కు రాసుకుంటున్నాయి.. మానస అలానే చూస్తుంది.
విక్రమ్ : మానస.. మానసా…
మానస : హా…
విక్రమ్ : నీ నెంబర్ ఇవ్వు..
మానస తన చేతిలో ఉన్న ఫోన్ ఇచ్చింది, నా నెంబర్ కి కాల్ చేసుకుని తనకి ఇచ్చేసాను..
విక్రమ్ : రాత్రి పన్నెండు ఇంటికి రెడీగా ఉండు, మాములు జీన్స్ టీ షర్ట్ వేసుకో.. ఇంకోటి అమ్మకి కూడా చెప్పొద్దు..
మానస ఆశ్చర్యంగానే “అలాగే” అంది..
విక్రమ్ : ఇక పదా..
మానస నీరసంగా “హ్మ్మ్ ” అంది…. వెళ్తున్న తన చెయ్యి పట్టుకులాగి బుగ్గ మీద ముద్దు పెట్టాను.. “హ్యాపీ బర్త్ డే” చెప్తూ..
మానస నన్ను వాటేసుకుంది అలాగే ఉండిపోయాం.. కొంచెం సేపటికి విడిపోయి మానస వాళ్ల వాళ్లతొను నేను మా వాళ్ళతోనూ కలిసిపోయాం, ఆ తరువాత మానస వాళ్ల అమ్మని తీసుకొచ్చి అమ్మకి పరిచయం చేసింది వాళ్లు ఇద్దరు మాట్లాడుకోడానికి వెళ్లారు వాళ్ళకి మీడియేటర్ గా సలీమా వెళ్ళింది.
పూజ : మానస నీ ఫ్రెండ్స్ ఎక్కడా కనిపించలేదు.
మానస : వాళ్ళకి నాకు చిన్న గొడవ, అందుకే అలిగి రాలేదు.
విక్రమ్ : మంచిది…. (మానస నన్ను చూసింది వెంటనే దగ్గి) రమ్యా మంచినీళ్లు అందుకో….
పూజ : వాడంతేలే మానస.. ఇంతకీ టూర్ కి నువ్వు వస్తున్నావా?
మానస : అదేం ప్రశ్న మా నాన్న అరెంజ్ చేసిన టూర్ కి నేను రాకుండా ఉంటానా?
పూజ : అంటే మాతో వస్తావని ఊహించలేదు.. మీరు ఉన్నోళ్లు కదా..
రమ్య పూజ తల మీద ఒకటి మొట్టి “మానస మాతో కలుస్తానంటే అందరం ఒకే చోట బస్సు ఎక్కుదాం”
మానస : చూద్దాం మానస రేపు కాలేజీ లో చెప్తారుగా దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం.
పార్టీ అయిపోయాక అందరం ఇంటికి బైలదేరాం, ఇంటికి వెళ్ళాక సలీమాకి పొట్ట నిండిపోయి ఇక నేను లేవలేను అని పడుకుండిపోయింది. అమ్మ తన రూమ్ లోకి వెళ్తూ కాలిని మూడు సార్లు తన్ని వెళ్లింది, పట్టీల శబ్దానికి అమ్మ పిలుస్తుందని లోపలికి వెళ్లాను అమ్మ పడుకుని ఉంది.
విక్రమ్ : ఏంటి మా?
కావ్య : స్పీడ్ స్పీడ్ గా సైగలు చేసింది దానికి గాజుల మోత తొడయ్యింది (మానస వాళ్ల అమ్మతొ మాట్లాడాను నాకు భయంగా ఉంది నీ గురించి).
Comments