page: 5
విక్రమ్ : నడుము గిల్లి “మీ నాన్న చేసే ఘనకార్యం చూపిద్దామనే తీసుకొచ్చా” అని అటు తిప్పి తన మెడ మీదగా చూస్తూ వెచ్చగా ఉన్న మానస నడుము పట్టుకున్నాను.
కొంచెం సేపటికి వాళ్ల నాన్న వెళ్ళిపోయాడు అక్కడ ఉన్న వాళ్లు కూడా వెళ్లిపోయారు..
“పదా” అని మానస చెయ్యి పట్టుకుని తీసుకెళ్లి హోటల్ వెనకకి వెళ్ళాము అక్కడ నేను అనుకున్నట్టు గానే ఎవ్వరూ కాపలా లేరు… అక్కడ ఉన్న మెట్లు ఎక్కి లోపలికి వెళ్లి చివరి రూమ్ లోకి వచ్చాము… పక్క రూమ్ కి ఈ రూమ్ కి మధ్యలో గోడ ఉంది….అక్కడ నుంచి కిటికీ లోనుంచి బైటికి వచ్చి గోడకి ఉన్న పైప్ మీద నిలబడ్డాను… మానస నన్నే చూస్తుంది.
విక్రమ్ : చూస్తావేంటి రా..
మానస : ఆమ్మో నాకు భయం కింద పడితే?
విక్రమ్ : నేను లేనా నువ్వు పడితే నీతో పాటు నేను దూకేస్తాలే రా…
మానస చెయ్యి అందించింది, తన చెయ్యి పట్టుకుని చిన్నగా పైప్ మీద నిల్చోపెట్టి పక్క రూమ్ కిటికీ దెగ్గరికి చిన్నగా వెళ్ళాము గోడని పట్టుకుని…
కిటికీ గ్లాస్ కొంచెం తెరిచే ఉంది చిన్నగా స్లయిడర్ ని పక్కకి జరిపి మానసకి చూపించాను, మానస అది చూసి నన్ను అనుమానంగా చూసింది తన మొహానికి చెమటలు పట్టాయి.
అక్కడనుంచి మానసని తీసుకుని బైటికి వచ్చి ఆ ఏరియా నుంచి వచ్చేసాము..
మానస : బండి ఆపు.
బండి పక్కకి ఆపాను… మానస బండి దిగి….
మానస : ఏంటి నేను చూసింది? ఎవరు వాళ్లంతా? ఎందుకు అలా ఉన్నారు?
విక్రమ్ : మీ నాన్న అమ్మాయిల స్మగిలింగ్ చేస్తున్నాడు అందుకే వాళ్ళని కట్టేసి ఉంచారు.
మానస : నువ్వు చెప్పేది నిజమా?
విక్రమ్ : మీ నాన్న గురించి నీకు తెలీదా?
మానస : తెలుసు కానీ మరీ ఇంత దూర్మార్గుడని తెలీదు..
విక్రమ్ : ఎల్లుండి ఆ అమ్మాయిలందరిని లంబసింగిలో రాత్రి పన్నెండిటికి అప్పగిస్తున్నారని తెలిసింది ..అడ్రస్ కూడా తెలుసు
మానస : ఇవన్నీ నీకెలా తెలుసు?
విక్రమ్ : మీ నాన్న మనుషులు మాట్లాడుకోగా విన్నాను అందుకే నీ కేక్ కటింగ్ చూడలేకపోయాను.
మానస : ఇప్పుడు ఏం చేద్దామని..
విక్రమ్ : ఈ ఊర్లో మీ నాన్నని ఎదిరించి వాళ్ళని కాపాడడం కష్టం, ట్రక్ మార్చేటప్పుడు అంత ఎక్కువ మంది ఉంటారని నేను అనుకోడంలేదు అక్కడే వీళ్ళని కాపాడాలి.
మానస : అందుకే మా నాన్న నేను టూర్ కి వస్తానంటే ఒప్పుకోడం లేదు.
విక్రమ్ : నాకు ఇంకో డౌట్ ఉంది అక్కడ వాళ్ల స్మగిలింగ్ కి మనల్ని టూర్ కి పంపించడానికి ఏదో లింక్ ఉందని నాకు అనిపిస్తుంది నువ్వు ఏదైనా చేసి ఎల్లుండి టూర్ లో బస్సు ఎక్కు..ఇక నువ్వు చెయ్యాల్సింది మీ నాన్నకి డౌట్ రాకుండా దీని గురించి ఏమైనా తెలుసుకోగలవేమో ప్రయత్నించు…ఈ లోగా నేను ఏదో ఇకటి ఆలోచిస్తాను…. ఇక పదా నిన్ను ఇంటి దెగ్గర డ్రాప్ చేస్తాను.
మానస నన్ను కౌగిలించుకుని నా పెదాల మీద ముద్దు పెట్టేసింది ఇన్ని ఏళ్లలో చిన్నప్పుడు అమ్మ పెట్టిన ముద్దు తరువాత నేను అనుభవిస్తున్న తొలి ముద్దు.
Comments