page: 6
ఒక నిమిషానికి మా పెదాలు విడిపోయ్యాయి నా దీనమైన మొహం చూసి మళ్ళీ ముద్దు పెట్టింది.
మానస : చాలా?
విక్రమ్ : ఉహు సరిపోలా..
ఉమ్ ఉమ్మ్ ఉమ్మా… “ఇంకా చాలా ఇస్తా నువ్వు వాళ్ళని కాపాడితే, వాళ్ళని కాపాడడమే నువ్వు నాకు ఇచ్చే నా తొలి బర్తడే గిఫ్ట్” అని హత్తుకుంది.
ఇద్దరం చేతిలో చెయ్యేసుకుని బండి దెగ్గరికి నడుస్తున్నాం రోడ్ అంతా కాళీ చల్లటి గాలి అక్కడక్కడా స్ట్రీట్ లైట్స్, గాలికి చెట్లకున్న ఒక్కొక్క ఆకులు రాలుతున్నాయి..
మానస : విక్రమ్ ఎ అమ్మాయికైనా తన బాయ్ ఫ్రెండ్ కనీసం తనకైనా హీరోలా ఉండాలి అనుకుంటుంది కానీ నువ్వు నిజంగా హీరోవే… ఇంత మంచివాడివి ధైర్యం కలవాడివి నిజంగా నువ్వు నా లైఫ్ లోకి రావడం నా అదృష్టం.
విక్రమ్ :…………..
మానస : ఏం మాట్లాడవే నా గురించి ఏదైనా చెప్పు , నిన్ను పొగిడిన వాళ్ళని తిరిగి పొగడడం సంస్కారం.
విక్రమ్ : దాన్ని సంస్కారం అనరు ఇచ్చి పుచ్చుకోడం అంటారు, నువ్వు పొగిడితే నేను పొగడాలా? అయినా ఏముంది నీ దెగ్గర అందంగా ఉంటావన్న పొగరు తప్ప.
మానస : నిన్నూ… అని నా వెనక పరిగెత్తింది..
నేను తప్పించుకుని ముందుకి వెళ్లి రెండు చేతులు చాపాను.. పరిగెత్తుకుంటూ వచ్చి నా కౌగిలిలో చేరిపోయింది, తన గడ్డం లేపి “మంచిదానివి, దయ గల దానివి అంతకు మించి నా మనసుకి నచ్చినదానివి ఐ లవ్ యూ” అని తన పెదాలు అందుకున్నాను.
కొన్ని నిమిషాలకి విడిపడి తన భుజం మీద చేయి వేసి నడిపించుకుంటూ బండి మీద ఎక్కించుకుని తనని వాళ్ల ఇంటి దెగ్గర డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళాను…
ఇంట్లోకి వెళ్లి సరాసరి నేరుగా సలీమా దెగ్గరికి వెళ్లాను, కాలీగా కూర్చుని ఉంది.
విక్రమ్ : ఇంకా పడుకోలేదా?
సలీమా : లేదు, ఎటు వెళ్లి వస్తున్నావ్ ఇంత అర్ధ రాత్రి ఏదో జరుగుతుంది ఏంటది నాకు తెలియాలి.
విక్రమ్ : సలీమా….
సలీమా : ఆ… చెప్పు, ఇన్ని రోజులకి నేను గుర్తొచ్చానా అయిపోయాయా నీ ప్రేమ తిరుగుళ్ళు. మొత్తానికి ఏదో పని పెట్టుకునే వచ్చావ్.
విక్రమ్ : రేపు మానసకి మన ఊరు చూపిస్తా అన్నా..
సలీమా : చూపించు దాంట్లో ఏముంది?
విక్రమ్ : నీ చేతుల్తో బిర్యాని చేస్తే….
సలీమా : అదా సంగతి, మనం వంట చేసుకున్న రోజులు తనకీ పంచుతున్నావా?
విక్రమ్ : వద్దా?
Comments