page: 7
సలీమా : సరేలే… బిర్యానీ చాలా ఖీర్ కూడా కావాలా?
సలీమా ని కౌగిలించుకుని “థాంక్స్ యే ఎక్కడ కోప్పడతావేమో అని భయపడ్డాను”.
సలీమా : ఇంతకీ ఎక్కడ వేస్తున్నారు మకాం.
విక్రమ్ : ఎవ్వరికీ చెప్పకూడదు మరీ…
సలీమా : హా చెప్పను, ఎక్కడా?
విక్రమ్ : మన పొలంలోనే మధ్యలో చిన్న గుంట ఉందిగా అందులోనే… సలీమా ఎవ్వరికీ చెప్పొద్దు ముందే చెప్తున్నా..
సలీమా : చెప్పాను లేరా పో…
విక్రమ్ బైటికి వెళ్లిన వెంటనే మంచం వెనకాల దాక్కున్న కావ్య లేచింది…
సలీమా : చూసావా అమ్మ పొలంలో అంట, అని సైగ చేసి నవ్వింది.
కావ్య : సలీమా భుజం మీద కొట్టి…నా కొడుకు బంగారం నవ్వుతూ అని సైగ చేసింది.
సలీమా : చూద్దామా రేపు విక్రమ్ మానసకి ముద్దు పెడతాడు.
కావ్య : నాకు తెలిసి వాడికి సిగ్గు ఎక్కువ పెట్టడు.
సలీమా : బెట్.
కావ్య : ఆలోచిస్తూ ఓడిపోతానని తెలిసినా సరే బెట్ అంది.
సలీమా రూమ్ లో నుంచి గాజుల చప్పుడు తెగ వినిపిస్తుంటే అనుకున్నాను ఏంటి వీళ్ళు ఇద్దరు తెగ మాట్లాడేసుకుంటున్నారు అని లోపలికి వెళ్లాను నన్ను చూసి మాములుగా కూర్చున్నారు.
విక్రమ్ : ఈ మధ్య బాగా గుస గుసలాడుకుంటున్నారు నాకు తెలీకుండా రహస్యాలు మెంటైన్ చేస్తున్నారా?
కావ్య : నువ్వు మాతో ఉంటే తెలుస్తాయి, నీకు చాలా పనులున్నాయి కదా..
విక్రమ్ : ఇవ్వాళ ఒక్క రోజే లేట్ అయ్యింది కద మా అలా మాట్లాడకు నాకు బాధగా ఉంటుంది నాకు ఎవరైనా నీ తరువాతే..
అమ్మ లేచి వచ్చి నన్ను హత్తుకుని, నా వీపు నిమిరింది… “నువ్వు కూడా రా అలా చూడకు” అన్నాను. సలీమా కూడా మా ఇద్దరినీ కరుచుకుంది… “మరి నేను” అని వెనక నుంచి నాన్న మాటలు వినిపించాయి, ఆయన కూడా వచ్చి మాలో కలిసిపోయాడు.
Comments