page: 8
విక్రమ్ : ఈ గుంపులో మానసకి కూడా చోటు ఉందిగా? అని నాన్న వంక చూసా…
ఆయన కొంత అయోమయంగా చూసాడు ఇంతలో అమ్మ నేను చెప్పానుగా ఇందాక అని సైగ చేసింది.
నాన్న : హా..హా…కత్చితంగా మధ్యలో గ్యాప్ ఉందిగా అది తనకే… ఇప్పుడు ఓకే నా…?
వెంటనే నాన్నని కౌగిలించుకున్నాను “థాంక్స్ నాన్న” అంటూ…
కావ్య : ఇక పదండి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది పడుకుందాం….
……………………………………………………………..
తెల్లారి కాలేజీకి వెళ్ళాము అందరికీ టూర్ గురించి చెప్పారు ముందు భద్రాచలం చూసుకుని అక్కడ నుంచి లంబసింగిలొ ఒక రాత్రి స్టే చేసి అక్కడ నుంచి అరకు, బుర్రా కేవ్స్ మిగిలినవి చూసుకుని చివరికి వైజాగ్ వెళ్లాలని నిర్ణయించారు ఇదంతా విన్న నేను మానస ఒకరి వైపు ఒకరం చూసుకున్నాం.
కాలేజీలో ఇవ్వాళ మా గ్యాంగ్ మొత్తం విచిత్రంగా ప్రవర్తించడం గమనిస్తూనే ఉన్నాను నాకు తెలీకుండా ఏదో జరుగుతుంది..
సలీమాకి సైగ చేసాను అంతా ఓకేనా అని, ఇంటికెళ్లన తరువాత ఒక గంటన్నర టైంలో మొత్తం వండేస్తా అంది.. అలాగే అన్నాను
కాలేజీ అయిపోయిన తరువాత చందు గాడికి బైక్ ఇచ్చేసి నేను మానస తన కారులో సిటీకి దూరంగా ఉన్న పొలాల దెగ్గరికి వెళ్ళాం.
మానస : “అబ్బా ఎంత బాగుంది చల్లటి గాలి” అని పొలాల్లోకి పరిగెత్తింది.
తన వెనకే వెళ్లి కొంచెం సేపు ఆడుకుంది ఆ వాతావరణం మానసని చిన్న పిల్లలా మార్చేసింది.
మానస : విక్రమ్ బలే ఉంది నాకు పల్లెటూరు లోనే ఉండాలని ఉంది ఇలాగే….
విక్రమ్ : మా ఊరికి వెళదాం వస్తావా ఇంతకంటే బాగుంటుంది.
మానస : పదా వెళదాం.
విక్రమ్ : ఇప్పుడేనా వెళదాంలే ఇంకా చెప్పు.
మానస : మన పెళ్లి అయ్యాక మనం కూడా వ్యవసాయం చేద్దాం.
విక్రమ్ : నువ్వా….
మానస : ఏ నేను చెయ్యలేనా… మనమిద్దరమే కలిసి ఒక ఎకరంలో పంట వేసి పండిద్దాము.
విక్రమ్ : అలాగేలే….తధాస్తూ..
మానస నా ఒళ్ళో కూర్చుని…
మానస : ఇంతకీ ఏం ప్లాన్ చేసావ్… పెట్టుకోడం పెట్టుకోడమే మా నాన్నతొ గొడవ పెట్టేసుకుంటున్నావ్.. ఏమవుతదో ఏమో…
తన బుగ్గ మీద ముద్దు పెట్టుకుని “ఏం జరిగినా నిన్ను వదలనులే…” అన్నాను.
మానస : నాకు తెలుసు.
విక్రమ్ : పదా వెళదాం… అని కార్ ఎక్కించి మా ఊరికి బైలదేరాము.
(∞)=(∞)=(∞)=(∞)=(∞)=(∞)
Comments